దేశమంతా తిరుగుతా.. మోదీ కుట్రలను ఎండగడతా
- బీసీల లెక్కలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాకే తెలంగాణలో అడుగు పెట్టాలి
- ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు
- బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను మో సం చేస్తుందని, మోదీ కుట్రలను ఎండగట్టేందుకు దేశమంతా తిరుగుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. బీసీల లెక్కలపై స్పష్టమైన నిర్ణ యం తీసుకున్న తర్వాతే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.
బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల తన నివా సంలో శనివారం ఆమరణ నిరహరదీక్ష చేపట్టారు. దీక్షకు కాంగ్రెస్, సీపీఎం, తెలంగాణ జనసమితి, బీసీ రాజ్యాధికార పార్టీతో పాటు బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు మద్ద తు ప్రకటించాయి. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీసీ జనాభా పెరుగుతోందని, జనగణనతో మాకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కిస్తున్న కేంద్రానికి.. బీసీలు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
బీసీ కులగణన చేయాలని ఇప్పటికే ప్రధాని మో దీకి పలుమార్లు లేఖలు రాశామని, వాటికి సమాధానం రాలేదన్నారు. జనగణనలో బీ సీల కాలం మెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేసే విధగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల లోనూ బీసీల కోట ఎంతో తేల్చలేదన్నారు. ఉద్యోగ, విద్యా రంగంలోనూ బీసీలకు సరైన వాటా దక్కాలని, బీసీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.
వీహెచ్‌ను కలిసి మద్దతు తెలిపిన వారి లో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెలే ్యలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, మేకపోతు నరేందర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్, పీసీసీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ నాయకులు రాజేశ్ కుమార్ అగర్వాల్, రాజీవ్‌రెడ్డి, అంజన్‌బాబు, సంజీవ్ ముదిరాజ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






