17 July, 2026 | 9:05 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

10-05-2026 12:39 AM

రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు

కరీంనగర్ టూ టౌన్ స్టేషన్‌లో బండి సంజయ్ కుమారుడు భగీరథ ఫిర్యాదు

కరీంనగర్, మే 9 (విజయక్రాంతి): హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఓ కుటుంబం రూ.5 కోట్ల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కరీంనగర్‌లోని టూ టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయ్యిందని ఆమెతో ఆలయాలు, పార్టీలకూ వెళ్లామని భగీరథ్ పేర్కొన్నారు. కానీ మెసేజ్‌లు, వీడియోలను ఉపయోగించి తనపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు.

అమ్మా యిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని భగీరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే తాను రూ.50 వేలు ఇచ్చానని.. ఇంకా డబ్బులు అడుగుతున్నారని పేర్కొన్నారు. ‘నేను అమాయకుడ్ని, నన్ను కాపాడండి’ అంటూ పోలీ సులను ఫిర్యాదులో వేడుకున్నాడు. ఈ మేర కు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.