10 May, 2026 | 2:08 AM

ప్రజలకు అండగా బైరెడ్డి ఫౌండేషన్

10-05-2026 12:59 AM

విస్తృతంగా సేవా కార్యక్రమాలు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతతో సాధారణ ప్రజలు, కార్మికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్న వేళ బైరెడ్డి ఫౌండేషన్ సమాజ సేవలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మే 7 నుంచి 9 వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో వేసవి ఉపశమన చర్యలు, రక్తదాన శిబిరం, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టి వేలాది మందికి అండ గా నిలిచింది.

రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి కూడలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో దాదాపు 6 వేల మందికి నిమ్మరసం, మజ్జిగ పంపిణీ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహకారంతో గచ్చిబౌలిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 300 మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ వద్ద క్యాన్సర్ రోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందికి సుమారు వెయ్యి ఆహార పొట్లా లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఫెనో మ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టాలెంట్ ఆక్విసిషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పిండి మాట్లాడుతూ.. సమాజానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి సంస్థ బాధ్యత. మా ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.

సమాజా నికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భవిష్యత్తులో కూడా కొనసాగుతాం, అని తెలిపారు. మహే బాయిరెడ్డి, హరి బాయిరెడ్డి స్థాపించిన బైరెడ్డి ఫౌండేషన్ ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తోంది.