10 May, 2026 | 12:59 AM

కరీంనగర్ బంద్ ప్రశాంతం

10-05-2026 12:00 AM
  1. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ పిలపునిచ్చిన బీఆర్‌ఎస్ 
  2. ఎమ్మెల్యే గంగుల, బీఆర్‌ఎస్ నేతల అరెస్టు
  3. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, వాణిజ్య సంఘాలు 

కరీంనగర్, మే09(విజయక్రాంతి): ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ శనివారం బీఆర్‌ఎస్ ఇచ్చిన కరీంనగర్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సంఘాలు స్వచ్ఛం దంగా బంద్‌ను పాటించాయి. కరీంనగర్ ప్రధాన వ్యాపార కూడలి టవర్ బోసిపోయి కనిపించింది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

శనివారం ఉదయం నుంచే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృ ష్ణారావును మనకొండూర్‌లో హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగ ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌లను అరెస్టు చేశారు.

బంద్‌లో పాల్గొనేందుకు గంగాధర మండలం బూరుగుపల్లి నుంచి బయల్దేరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్‌ను మార్గమ ధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని బూరుగుపల్లిలోని నివాసాని కి తరలించి హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, గ్రంథాల య సంస్థ మాజీ చైర్మన్ అనిల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. 

హుజురాబాద్‌లో అరెస్టులు

బీఆర్‌ఎస్ ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుతో ముందస్తు చర్యల్లో భాగంగా హుజురాబాద్  పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులను శనివారం ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, రాజాపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి,

కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణలను ఉదయం 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ మండలంలోని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు తెల్లవారు జాము నుంచే వారి ఇళ్లకు వెళ్లారు.