గుజరాత్ ఆల్‌రౌండ్ షో
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆరంభంలో తడబడిన ఆ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో టాప్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్ కు చేరువైంది. బ్యాటింగ్‌లో గిల్ , సాయి సుదర్శన్ మెరుపులు..బౌలింగ్‌లో రషీద్ ఖాన్, హోల్డర్ చెలరేగడంతో రాజస్థాన్‌కు మరో ఓటమి తప్పలేదు.
- చిత్తుగా ఓడిన రాజస్థాన్
- గిల్, సాయి సుదర్శన్ మెరుపులు
- తిప్పేసిన రషీద్‌ఖాన్
- రెండో ప్లేస్‌కు టైటాన్స్
- ఐదో ప్లేస్‌కు రాజస్థాన్
జైపూర్, మే 9 : ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ రెచ్చిపోయారు. రాజస్థాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి జోరుకు పవర్ ప్లేలో 82 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా దూకుడు కొనసాగిస్తూ వీరి జోడీ చెలరేగిపోయింది. తొలి వికెట్‌కు గిల్, సాయి సుదర్శన్ 10.5 ఓవర్లలోనే 118 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 55 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. గిల్ తన ఫామ్ కొనసాగించాడు. బట్లర్‌తో కలిసి 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తర్వాత బట్లర్ 13 రన్స్ కు ఔటవగా.. గిల్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
గిల్ 44 బంతుల్లోనే 84 (9 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ కు వెనుదిరిగాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లో 37 (2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా...తెవాటియా 14 (4 బంతుల్లో) దూకు డుగా ఆడాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్ల దెబ్బకు రాజస్థాన్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా..రాజ్ పూ నియా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, బౌండరీలతో
అదరగొట్టాడు. జైస్వాల్‌కు పెద్దగా స్ట్రైకింగ్ ఇవ్వకుండా వైభవ్ ధాటిగా ఆడాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 2.5 ఓవర్లలోనే 38 పరుగులు జోడించారు. జైస్వాల్ (3) వెనుదిరిగినా తర్వాత సిరాజ్ వైభవ్ సూర్యవంశీ( 16 బంతుల్లో 36)ని పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడ నుంచి రాజ స్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో రాజస్థాన్ కీలక బ్యాటర్లంతా వికె ట్లు సమర్పిం చుకున్నారు. జురెల్ (24), హెట్ మెయిర్ (6), ఫెరీరా(4) పరుగులకే ఔటవడంతో రాజస్థాన్ ఓటమి ఖాయమైంది.
జడేజా (38) పోరాడినా మిగిలిన బ్యాట ర్ల నుంచి సపోర్ట్ లేకపోయింది. తర్వాత జాసన్ హోల్డ ర్ రాజస్థాన్ టెయిలెండర్ల భరతం పట్టాడు. ఫలితంగా రాజస్థాన్ 152 పరుగులకే ఆలౌటైంది. 77 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. రషీద్‌ఖాన్ 4 కీలక వికెట్లు తీయగా.. హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరు వైంది. అటు వరుసగా రెండో ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
స్కోరు బోర్డు
గుజరాత్ ఇన్నింగ్స్ : 229/4 ( గిల్ 84 , సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37, బ్రిజేశ్ శర్మ 2/47, జడేజా1/34 )
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 152 ( జడేజా 38, వైభవ్ సూర్యవంశీ 36, జురెల్ 34 ; రషీద్ ఖాన్4/33, రబాడ 2/33, హోల్డర్ 3/12)






