దేవునితండాలో గాలివాన భీభత్సం
09-05-2026 09:16 PM
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలం దేవునితండాలో గాలివాన భీభత్సం సృష్టించింది. దింతో గ్రామంలో పలుచోట్లా చెట్లు, కరెంట్ స్తంబాలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన నునావత్ రాజు కు చెందిన పశువుల పాకపై కరెంటు స్తంభం పడటంతో సుమారు 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని భాధిత రైతు తెలిపారు. ఈ సంఘటలో అదృష్టవషాత్తు ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లలేదు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






