నగరీకరణతో కొత్త సవాళ్లు
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు మల్టీలెవల్ పార్కింగ్‌లు
- మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విప్లవాత్మకమైన నిర్ణయం
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : ‘ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్ ) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్త్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణ, పట్టణ వ్య వహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ ధునీకరణ, నగరీకరణతో ఎదురయ్యే సవా ళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజాప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాం డింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న నగరీకరణ వల్ల భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉం టుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని.
కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారి డార్ల వంటి మూడు విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానా న్ని ఎంచుకున్నామని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్ర మే సరిపోదు, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగ మించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కిం గ్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు.
రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించాం
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు విభాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బ న్ రీజియన్ ఎకానమీ (క్యూర్ ) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామని, ఓఆర్‌ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (ప్యూర్) ప్రాంతాన్ని మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించామన్నారు.
ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (ప్యూర్)గా వ్యవ సాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేసిన ట్లు చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్‌ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నామని, లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతు న్నామని వెల్లడించారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూ సీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు చెప్పారు.
కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు
నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం, ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తు న్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజి యన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మా ర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం.. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభి వృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించా రు.
నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగ తులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై సీఎం రేవంత్‌రెడ్డిని స్టాండింగ్ కమిటీ అభినందించింది. రాష్ట్రం లో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కూడా కమిటీ ప్రశంసించింది. అంత కుముందు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి సత్కరించారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






