47వ అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి
- మై హోమ్ నిర్మాణ పనుల్లో విషాదం
- మృతుడి స్వస్థలం బీహార్
- ఆందోళనకు దిగిన కార్మికులు
- సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఘటన
సంగారెడ్డి, మే 9 (విజయక్రాంతి): నిర్మాణంలో ఉన్న 47వ బహుళ అంతస్తు పైనుం చి ఓ కార్మికుడు జారిపడి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తెల్లాపూర్లోని మై హోం నిర్మాణ సంస్థ చేపడుతున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ (28) అనే కార్మికుడు 47వ అంతస్తు నుంచి జారిపడి దుర్మరణం చెందాడు.
సంజీవ్ కుమార్ తన సహచరుడు రమేష్ పాస్వాన్‌తో కలిసి 47వ అంతస్తులో విద్యుత్ కేబుళ్ళను సరిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ జారిపడ్డారు. అయితే రమేష్ కిందపడుతూ ఓ స్లాబ్‌ను పట్టుకొని ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు.సంజీవ్ కు మార్ మాత్రం కిందకు పడిపోతూ 11వ అం తస్తు వద్ద కేబుల్ వెళ్లే సొరంగంలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలి పారు.
మృతుడు 14 రోజుల క్రితమే బీహార్ నుంచి ఉపాధి కోసం తెల్లాపూర్‌కు వచ్చినట్లు తెలిసింది.ఘటన విషయం తెలిసిన వెంటనే బీహార్‌కు చెందిన కార్మికులు శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగా రు. నిర్మాణ ప్రాంతంలోని రేకులను ధ్వంసం చేసి రోడ్డుపై పడవేస్తూ నిరసన వ్యక్తం చేశా రు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి ని అదుపులోకి తెచ్చారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేసి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






