కందనూలులో క్విడ్ ప్రోకో!
- వట్టెం రిజర్వాయర్ గిరిజన భూ నిర్వాసితులకు గత ప్రభుత్వ హయాంలో పరిహారం
- సహకరించిన అప్పటి ఓ ప్రధాన పార్టీ నేతలు!
- ప్రతిగా తమ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేయాలని ఒత్తిడి
- ఒక్కొక్కరు 1,00-, 150 స్క్వేర్ యాడ్స్ చొప్పున కొనుగోలు
- ఇళ్లు నిర్మించుకుందామని వెళ్లగా చేదు అనుభవం
- అక్రమ వెంచర్ అని తేలడంతో గగ్గోలు
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి
నాగర్‌కర్నూల్ మే 9 (విజయక్రాంతి) : వారంతా గిరిజన రైతులు. రియల్ ఎస్టేట్ వ్యా పారి మాటలు నమ్మి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేశా రు. తీరా ఇళ్లు నిర్మించుకుందామని వెళ్లగా చేదనుభవం ఎదురైంది. అక్రమ వెంచర్ అని తేలడంతో గొల్లుమంటున్నారు. నాగర్‌కర్నూ లు (కందనూలు) జిల్లాలో ఈ కుంభకోణం ఆలస్యంగా వెలుగుచూసింది. దీని వెనుక ఓ ప్రధాన పార్టీ నేత ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
ఏం జరిగిందంటే..
నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి శివారు 101 సర్వే నంబర్‌లో తుమ్మ చెవిరెడ్డి అనే రైతుకు 8 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అట్టి భూమిని 1970లో బ్యాంకులో కుదువ పెట్టి రుణం పొందాడు. కాగా, కొంతకాలం తరువాత చెవిరెడ్డి మరణించాడు. ఆయన మరణానంతరం అతని కుటుంబ సభ్యులంతా వలస వెళ్లడంతో క్రమంగా అట్టి భూమి ఆక్రమణకు గురైంది. చివరకు మిగిలిన ఎకరం 20 గుంటల భూమిని చెవిరెడ్డి పెద్ద కుమారుడు రేమన్‌రెడ్డి నుంచి నారాయణపేట ప్రాంతానికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది అక్టోబర్‌లో కొనుగోలు చేశాడు.
అదే సర్వే నంబర్ పరిధిలో బిజినపల్లి ప్రాంతానికి చెంది న అప్పటి ఓ ప్రధాన పార్టీ నాయకుడికి రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. కాగా తనకున్న రెండు ఎకరాలతో పాటు పక్కనే ఉన్న మరో ౪ ఎకరాల భూమిని 2015లో కబ్జా చేశాడు. ఈ ఆరెకరాల్లో మరో నాయకుడితో కలిసి నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేశారు.
అక్రమ భూ బాగోతం ఇలా వెలుగులోకి వచ్చింది..
పాలమూరు ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్ పరిధిలో సుమారు 130 మంది దళిత గిరిజన రైతులు భూములు కోల్పోయా రు. వారికి గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకుల సహకారంతో పరిహారం డబ్బులు వచ్చాయి. అట్టి డబ్బులను తామే ఇప్పించానని తమ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేయాలని నిర్వాసితులపై వెంచర్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీంతో నిర్వాసితులు ఒక్కొక్కరు సదరు వెంచర్‌లో 1,00-, 150 స్క్వేర్ యాడ్స్ చొప్పున 2016లో ప్లాట్లు కొనుగోలు చేశారు.
కొంతకాలం తరువాత అట్టి ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుందామని వెళ్లిన నిర్వాసితులకు చేదు అనుభవం ఎదురైంది. అసలు పట్టాదారు తన భూమిలో నెలకొల్పిన అక్రమ వెంచర్ తొలగించాలని కోర్టును ఆశ్రయించాడు. గత నెల 23న అతనికి అనుకూ లంగా కోర్టు తీర్పు రావడంతో వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన నిర్వాసితులు లబోదిబోమంటున్నారు. తమకు ప్లాట్లు విక్రయిం చిన వ్యక్తి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా నీళ్లు నమలడంతో మోసపోయామని గ్రహించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చెల్లించిన డబ్బుల ను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లించారని ఆరోపించారు.
వెంచర్ నిర్వాహకులకు రైతుభరోసా!
వెంచర్ చేసిన ఆరు ఎకరాలకు సంబంధించి వెంచర్ నిర్వాహకుల ఖాతాల్లో రైతు భరోసా జమ అవుతుండటం గమనార్హం.






