9 May, 2026 | 7:13 PM

11 నుండి అన్ని పాఠశాలల్లో విద్యా వారోత్సవాలు

09-05-2026 05:51 PM

సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల  ఆదేశాల మేరకు “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద ఈనెల 11 నుండి  17 వరకు అన్ని పాఠశాలల్లో విద్యా వారోత్సవాలు నిర్వహించవలసిందిగా మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య సుల్తానాబాద్ మండలంలోని పిఎస్, యుపిఎస్, హెచ్ఎస్హెచ్ఎంఎస్ లను ఆదేశించినారు. ఈ సందర్భంగా శనివారం ఆయన  మాట్లాడుతూ అన్ని పాఠశాలలు క్రింది కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఏఏపీసి సభ్యుల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించవలెను అని తెలిపారు.

మొదటి రోజు ఫౌండేషన్ డే అండ్ సమ్మర్ క్యాంపులు ,అన్ని పాఠశాలల్లో ఫౌండేషన్ డే కార్యక్రమాలునిర్వహించాలి. విద్యార్థుల భాగస్వామ్యంతో సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలల్లో పెండింగ్‌ లో ఉన్న మిగిలిపోయిన అభివృద్ధి  పనులనుప్రారంభించాలి. సాధ్యమైన చోట పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పారు. 2వ రోజు ఎస్‌ఎస్‌సి రెమిడియల్ క్యాంపులు, ఎస్‌ఎస్‌సి రెమిడియల్ కోచింగ్ క్యాంపులను ప్రారంభించాలి. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

సబ్జెక్ట్ ఉపాధ్యాయులు రెమిడియల్ బోధనా ప్రణాళికలు సిద్ధం చేసి హాజరు నమోదు నిర్వహించాలి. మూడో రోజు సర్పంచ్‌లతో పాఠశాల విద్యా కార్యక్రమాలపై వర్క్‌షాప్:నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులతో జరిగే సమావేశాలు,వర్క్‌షాప్‌లలో పాల్గొనాలి. పాఠశాలఅభివృద్ధి కార్యక్రమాలు, నమోదు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, సమాజ భాగస్వామ్యంపై చర్చించాలి. గ్రామ విద్యా కమిటీలు మరియు స్థానిక సంస్థలతో సమన్వయం కలిగి ఉండాలి.4వ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం అండ్ మెగా పీటీఎం:పాఠశాల స్థాయిఅన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి.

ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్  నిర్వహించాలి.విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, అభ్యాస ఫలితాలు మరియు పాఠశాల అభివృద్ధికార్యక్రమాలపైతల్లిదండ్రులతో చర్చించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమమైన హాజరు మరియు నమోదు కోసంతల్లిదండ్రులనుప్రోత్సహించాలి అని ఉపాధ్యాయుల పాల్గొనడం, హాజరు నివేదికను ఎం ఆర్ సి – సుల్తానాబాద్ కు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం పఠన కార్యక్రమాలు, కథల చెప్పడం, పుస్తక ప్రదర్శనలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. విద్యార్థులు పాఠశాల గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించేలా ప్రోత్సహించాలి. పిల్లల్లో పఠన అలవాటును పెంపొందించాలి. 6వ రోజు కళలు, చేతిపనులు అండ్ సాంస్కృతిక దినోత్సవం, 

చిత్రలేఖనం, పెయింటింగ్, చేతిపనులు, గానం, నృత్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులందరూ పాల్గొనేలా ప్రోత్సహించాలి. విద్యార్థుల కళా, చేతిపనులను పాఠశాలలో ప్రదర్శించాలి అన్నారు. 7వ రోజు విద్యా విజయోత్సవం (జిల్లా స్థాయి కార్యక్రమం) ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల్లో 540 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయిలో సన్మానిస్తారు. అర్హులైన విద్యార్థుల వివరాలను వెంటనే గుర్తించి పంపించాలి.

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి, తల్లిదండ్రులు, సమాజంలో అవగాహన కల్పించాలి అని, అన్ని  పాఠశాలలప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, విద్యా వారోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించవలెను. ప్రతిరోజు కార్యక్రమాల ఫోటోలు, హాజరు వివరాలు మరియు సంక్షిప్త నివేదికలను తప్పనిసరిగా ఎం ఆర్ సి సుల్తానాబాద్ లో సమర్పించాలి.  తద్వారా జిల్లా ఉన్నతాధికారులకు పంపబడుతుందని,ఈ కార్యక్రమం ఘనవిజయానికి ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ సహకరించవలసిందిగా సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య కోరారు.