9 May, 2026 | 6:46 PM

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు

09-05-2026 05:10 PM

చేగుంట,(విజయక్రాంతి): ​చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోతుల బెడద నివారణకు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ యాజమాని చొల్లేటి సుజాత, కృష్ణమూర్తి, కుటుంబసభ్యులు రక్షణ ఏర్పాట్లను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కోతుల నుండి ఉపశమనం పొందేలా ఈ సౌకర్యాలను కల్పించామని అన్నారు. దైవ కార్యాల పట్ల వారు చూపిస్తున్న చొరవను, వారి సేవా గుణాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా వారిని అభినందించారు.