13 March, 2026 | 5:37 AM

ద్రవిడ్, మిథాలీలకు లైఫ్ టైమ్ అవార్డు

13-03-2026 12:00 AM
  1. దిగ్గజాలకు బీసీసీఐ గౌరవం
  2. గిల్‌కు పాలి ఉమ్రిగర్ అవార్డు
  3. మార్చి 15న నమన్ అవార్డుల వేడుక

ముంబై, మార్చి 12: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ద్రవిడ్ అందించిన సేవలకు బీసీసీఐ లైఫ్ టైమ్ అవార్డు అందించనుంది. బీసీసీఐ నిర్వహించే వార్షిక నమన్ అవార్డుల కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక కల్నల్ సీకే నా యుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుంది.

ఈ అవార్డును ఈనెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ద్రావిడ్‌కు ప్రదానం చేయనున్నారు. రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ బ్యా టర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. దాదా పు 16 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ద్రావిడ్ భారత్ తరఫున మొత్తం 509 మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్ క్రికెట్‌లో 164 మ్యాచులు ఆడి 13,288 పరుగులు చేశారు. ఆయన సగటు 52.31 కాగా, అందులో 36 శతకాలు ఉన్నా యి.

వన్‌డే క్రికెట్‌లో కూడా ద్రావిడ్ అద్భుత ప్రదర్శన చేశారు. 344 వన్‌డే మ్యాచ్‌లలో 10,889 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 83 అర్ధశతకాలు ఉన్నాయి. అండర్ -19 కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2018 లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపాడు. అదే సమయంలో ఇండియా ఏ జట్టుకు కూడా మార్గనిర్దేశనం చేశాడు. రిటైర్మెంట్ తర్వాత టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు.

ద్రవిడ్ కోచింగ్‌లోనే 2024 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే నమన్ అవార్డ్ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్ దిగ్గ జం మిథాలీ రాజుకు కూడా లైఫ్‌టైమ్ అవా ర్డు ఇవ్వనున్నారు. ప్రపంచ మహిళల క్రికెట్‌లో ఆమె ఎన్నో రికార్డులు అందుకుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన రికార్డు మిథాలీ పేరిటే ఉంది. మరోవైపు బీసీసీఐ ఈ ఏడాది ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (పా లి ఉమ్రిగర్ అవార్డు) పురస్కారానికి గిల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

గతేడాది గిల్ బ్యాట్‌తో సృష్టించిన పరుగుల సునామీ, కె ప్టెన్‌గా సాధించిన విజయాలే అతడికి ఈ పు రస్కారం తెచ్చిపెట్టాయి. 2025 క్యాలెండర్ ఇయర్ శుభ్మన్ గిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. అతను మొత్తం 1,764 పరుగులు సాధించాడు.

ఇందులో 7 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్, ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2 డ్రా చేయ డంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఏకంగా 754 పరుగులు సాధించాడు.