13 March, 2026 | 5:37 AM

యుద్ధ భయం

13-03-2026 12:00 AM

ఐపీఎల్‌కు వార్ ఎఫెక్ట్ 

విదేశీ ప్లేయర్స్‌ను రప్పించడమే సవాల్

  1. ఆందోళనలో ఫ్రాంచైజీలు
  2. వేచి చూసే ధోరణిలో బీసీసీఐ 

ముంబై, మార్చి, 12 : టీ ట్వంటీ వరల్ కప్ ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైనే పడింది. మొన్నటి వరకు షెడ్యూల్ పై సందిగ్ధత కొనసాగినా బీసీసీఐ దానికి తెర దించింది. 20 మ్యాచ్‌లతో తొలి దశ షెడ్యూల్ ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మార్చి 28న జరిగే మ్యాచ్ తో ఈ సీజన్‌కు తెర లేవనుంది.

ఇప్పటికే ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న ప్లేయర్స్‌తో ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫ్రాంచైజీలకు కొత్త టెన్షన్ మొదలయింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో ఐపీఎల్ సీజన్ కోసం విదేశీ ప్లేయర్స్ సమయానికి భారత్‌కు వస్తారా అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వం టి ప్లేయర్స్ అందరూ భారత్ కు రావాలంటే దుబాయ్ మీదుగానే ప్రయాణించాలి.

ఇపు డు అక్కడ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు నెలకొన్నాయి. దీంతో ఆటగాళ్ళకు కూడా టెన్షన్ మొదలయింది. ఇపుడు విదేశీ ప్లేయర్స్‌ను భారత్‌కు తీసుకురావడమే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పెద్ద సవాల్. ఈ యుద్ధం ప్రభావంతో మరికొన్ని కీలక అంశాలు కూడా అటు బోర్డుకు, ఇటు ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి మొదలయింది. ఐపీఎల్ వం టి భారీ టోర్నమెంట్ను నిర్వహించాలంటే భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు అవసరం.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల మూడు ప్రధాన రంగాల్లో ఇబ్బందులు తలె త్తే అవకాశం ఉంది. మొదటిది గ్యాస్, చము రు సరఫరా. స్టేడియంలలో ఫ్లడ్ లైట్ల కోసం వినియోగించే ఇంధనం, వేలాది మంది అతిథులకు వంటకాలు సిద్ధం చేసే హోటళ్లలో ఎల్పీజీ కొరత పెద్ద సమస్యగా మారింది. రెండోది విమానయాన రంగం. పశ్చిమ ఆసియాలో గగనతల ఆంక్షల వల్ల విదేశీ ఆటగా ళ్లు భారత్ చేరుకోవడం కష్టతరంగా మారింది.

మూడోది రవాణా ఖర్చులు. ఇంధన ధరలు పెరగడం వల్ల జట్లు ఒక నగరం నుం చి మరో నగరానికి ప్రయాణించడం భారం గా మారే అవకాశం ఉంది. దీంతో మార్చి 28 నుంచి ఐపీఎల్ నిర్వహణ సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ కూడా ఈ అంశంపై స్పందించింది. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడా నికి వెనుకాడబోమని స్పష్టం చేసింది.

హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్ర స్తుతానికి అంతా నియంత్రణలోనే ఉందని వారు చెబుతున్నా రని బోర్డు అధికారి ఒకరు  తెలిపారు. పరిస్థితి మరింత దారు ణంగా మారితే తప్ప షెడ్యూల్లో మార్పులు ఉండవని, అయితే వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నామని బీసీసీఐ వెల్లడించింది. బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హోటల్ యజమానుల సం ఘాల సమాచారం ప్రకారం, వారి వద్ద కేవ లం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడా ఎల్పీజీ మాత్రమే నిల్వ ఉంది.

దీనివల్ల కొన్ని హోటళ్లు ఇప్పటికే తమ మెనూలో ఐటమ్స్ ను తగ్గించేశాయి. కేంద్ర పెట్రోలియం, సహ జ వాయువు మంత్రిత్వ శాఖ కూడా గృహ అవసరాలకు, అత్యవసర రంగానికి మాత్ర మే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉ న్నందున,  రానున్న వారం రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.