13 March, 2026 | 5:31 AM

ఐపీఎల్‌కు హేజిల్‌వుడ్ డౌటే!

13-03-2026 12:00 AM
  1. గాయం నుంచి కోలుకొని ఆసీస్ పేసర్
  2. ఫిట్‌నెస్ సాధించడం అనుమానమే

సిడ్నీ, మార్చి 12: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తొలి దశ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియ న్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆర్సీబీని కీలక ఆటగాళ్ల గాయాలు వెంటాడుతున్నాయి.

ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ పూ ర్తిగా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. గా యం కారణంగా గత ఏడాది ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యాడు. దాని నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచా రం. ప్రస్తుతం అతడు ఫిజియో ఆధ్వర్యంలో ఫిట్నె స్ సాధించే పనిలో ఉన్నాడు.

దీంతో అతడు ఐపీఎల్ ఆడేది అనుమానంగా మా రింది. ఒకవేళ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2026కి దూరం అయితే అది ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడంలో హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు.