16 March, 2026 | 1:53 AM

రెవెన్యూ శాఖకు సొంత భవనాలేవీ?

16-03-2026 12:06 AM
  1. ఏళ్ల తరబడి వసతుల లేమీ.. 

కీలక దాస్త్రాలకు రక్షణ కరువు?

పలుచోట్ల శిథిలావస్థలో సొంత భవనాలు

రెవెన్యూ మంత్రి ప్రకటనతో చిగురుస్తున్న ఆశలు 

నిర్మల్, మార్చి ౧౫ (విజయక్రాంతి): ప్రభు త్వ పరిపాలనలో కీలకంగా ఉన్న రెవెన్యూ శాఖకు సొంతభవనాలు కరువయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించిన కీలక దస్త్రాలు అందించి రెవెన్యూ శాఖకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనా లు మరొకరుని వసంతుల మధ్య అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరిపాలన సమర్థం కోసం ప్రభుత్వం 2016లోని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి జనాభా అనుకూలంగా కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. నిర్మ ల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

మండల స్థాయిలో కీలకంగా ఉండే మండల రెవెన్యూ శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఇతర భవనాలు అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు. దీంతో పరిపాలన విధులు నిర్వహించే సిబ్బంది తోపాటు ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు ఇరుకు గదులు, ప్రభుత్వ పాత భవనంలో నిర్వహించడం వల్ల గోడకు రంధ్రాలు వర్షం వస్తే తడి గా ఏర్పాటులలో ఈ భవనాలు ఈ భవనాలు నిర్వహిస్తున్నారు. 

నూతన భవనాలకు మోక్షం ఎప్పుడు 

నిర్మల్ జిల్లాలో రెవెన్యూ పరిపాలమైన పాలన అందించేందుకు ప్రభుత్వం మండల రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో అర్బన్ రూరల్ తాసిల్దార్ కార్యాలయాలు ఆర్డిఓ కార్యాలయంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. కుంటాలలో  సోన బీసీ హాస్టల్ నిర్వహిస్తుండగా, దిల్వార్పూర్ బాసర, నర్సాపూర్  మామడ దస్తురాబాద్ పెంబి, తదితర మండలాలు తాత్కాలిక భవనంలో రెవెన్యూ కార్యాలయాలు నిర్వహిస్తు న్నారు.

ముధోల్, ఖానాపూర్ బైంసా కుబీర్ తదితర మండలాల్లో సొంత భవనాలు ఉన్న అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే చాలా భవనాలు తాసిల్దార్‌తో పాటు ఉప తాసిల్దార్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డుల గది, ధరణి కేంద్రం, తదితర వసతులు కల్పించ గదులు ఉండాలి.  ఇరుకు గదుల్లో రెండు మూడు సెక్షన్లో నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు కనీసం కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో వరండాల్లో వేచి చూస్తున్నారు. మరుగుదొడ్లు మూత్రశాలలు తాగునీటి సౌకర్యం సరిగ్గా లేదు.

వర్షాకాలం వచ్చిందంటే భయం భయంతో వణుకుతున్నారు. రక్షణ కూడలు లేకపోవడంతో విలువైన ఫైళ్లకు రక్షణ లేకుం డా పోతుంది. ప్రభుత్వంలో కీలక శాఖ రెవె న్యూ అయినప్పటికీ సొంత భవనాలు లేక అరకులని వసతుల మధ్య తాత్కాలిక భవనాలను ఏళ్ల తరబడి పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్రం వస్తే కొత్త భవనాలు నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన ఇప్పటివరకు నెరవేరలేదు. 

రెవెన్యూ మంత్రి మాటలతో చిగురిస్తున్న ఆశలు..

నిర్మల్ జిల్లాలో తాసీల్దార్ కార్యాలయాలకు సొంత భవనాల కోసం వెంటనే స్థలం సేకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కలెక్టర్‌ను ఆదేశిం చారు. రాష్ట్రవ్యాప్తంగా రెవిన్యూ శాఖ నిర్వహిస్తున్న కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో సంబంధిత అధికారులతో నెల రోజుల క్రితం హైదరాబాదులో సమీక్ష నిర్వహించారు. ఏ జిల్లాలో ఎన్ని కార్యాలయాలు అవసరం ప్రస్తుతం సంత భవనాలు ఉన్న కార్యాలయాలు, సొంతభవనాలు ఉన్న కార్యాలయాలు, శిథిలావస్థకు చేరిన కార్యాలు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. 

ఒక్కొక్క తాసిల్దార్ కార్యాలయానికి 40 గుంటల వరకు ప్రభుత్వ స్థలం అవసరం కావడంతో స్థల సేకరణ పూర్తిచేసి తాసిల్దార్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదన పంపితే నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ డివిజన్ అధికతో పాటు తాసీల్దార్‌లతో సమావేశం నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం నిర్మా ణంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరగా నిధులు మంజూ రు చేసి కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు అధికారులకు ప్రయోజనకరంగా ఉంటుంది