17-02-2026 05:43:07 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం భీల్యా నాయక్ తండాలో దొడ్డి కొమరయ్య సినిమా దర్శకులు ఎం.సేనాపతి, కోదాడ నియోజకవర్గం దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్, సహనిర్మాత అంకతి అనసూర్య, బానోతు రంగా నాయక్ టీం సభ్యులు దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తెలంగాణ ప్రజలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేవని అవకాశం కోసం మనం ఆంధ్ర సినిమా పెట్టుబడుల దారులు దగ్గర బిచ్చగాల అడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మన తెలంగాణ చరిత్రను,మన తెలంగాణ వీరుల పోరాటం గురించి భావ్య ప్రపంచానికి తెలియనీయకుండా ఈ ఆంధ్ర పెట్టుబడుల దారులు ప్రయత్నం చేస్తున్నారని మడ్డిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, కోట నాయక్,గోవిందు,వార్డు సభ్యులు బాలకృష్ణ నాయక్,బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.