27 June, 2026 | 6:45 PM

విద్యే భవిష్యత్తుకు బాట

27-06-2026 05:39 PM

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

కల్లూరు,(విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి తమ భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ కౌన్సిలర్లు ఉబ్బన రాంబాబు, కనపర్తి శ్యామల సూచించారు. శనివారం స్థానిక అంబేద్కర్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో పరిశసీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

వరకూటి దావీదు, పుష్ప రాఘవమ్మ జ్ఞాపకార్థంగా మేరిఏసుపాదం, చంద్రశేఖర్ సౌజన్యంతో ఈ విద్యా సామగ్రిని అందజేసినట్లు ట్రస్ట్ చైర్మన్,ఎస్జిపిఏటి జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య తెలిపారు.విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.