ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం
27-06-2026 06:18 PM
బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాములు గౌడ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): గానుగబండ గ్రామంలో 239వ బూతులో బిఎల్ఓ స్రవంతి ఓటర్ల సవరణ పత్రాలను అందజేసిన సందర్భంగా స్థానిక సర్పంచ్ వెంకటమ్మ మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ మాజీ ఎంపిటిసి గుండగాని దుర్గయ్య బిఎల్ఎ వీరయ్య శ్రీను రామచంద్రు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2002 జనాభా లెక్కల ప్రకారం, ఓటు హక్కు కలిగిన వారంతా, తిరిగి ఓటు పొందే విధంగా ఓటర్ పత్రాన్ని చదివి, పూర్తిచేసి, అధికారులకు ఇవ్వాలని కోరారు.






