ఘనంగా మహనీయుల జయంతి ఉత్సవాలు
కొత్తపల్లి,(విజయక్రాంతి): సమాజం మహానీయుల ఆలోచనలను ఆచరణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని మహానుయుల ఆలోచన విధానంతో దేశం అభివృద్ధి చెందుతుందని, దేశానికి క్రాంతి వీరులైన మహనీయుల జయంతి ఉత్సావాల సందర్భంగా కరీంనగర్ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పిఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ మహానుయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరంలో మార్చి 20 నుండి జూన్ 27 వరకు గౌతమ బుద్ధుడు, మహరాజా ఛత్రపతి శివాజీ, ఏకలవ్య మహరాజా, మహాత్మా జ్యోతిరావు పూలే,డాక్టర్ బాబాసాహేబ్ బి.ఆర్.అంబేద్కర్.,కొమురం భీమ్,బోజ్జా తారకం మొదలైన మహానుభావులందరి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పిఐ) ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది, మాన్యశ్రీ బోజ్జా తారకం జూన్ 27 వరకు జయంతిని ఆర్.పి.ఐ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సావాలును నిర్వహిస్తున్నామని అన్నారు. మహనీయుల ఆశయాలను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కొనసాగిస్తోందిని మహనీయుల సిద్దాంతం యువతకు అవసరమని అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) మహనీయుల సిద్ధాంతంతో పార్టీ పనిచేస్తుందని అని రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అన్నారు.






