స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 43 పాఠశాలలకు నోటుబుక్స్ పంపిణీ
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి స్ఫూర్తి ఫౌండేషన్ మరోసారి చేయూతనందించింది. ఫౌండేషన్ ధాతల సహకారంతో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో ప్రతి విద్యార్థికి 5 నోటుబుక్స్ చొప్పున పంపిణీ చేశారు. మొత్తం 43 పాఠశాలలకు ఈ నోటుబుక్స్ అందజేయడం జరిగింది.
పంపిణీ కార్యక్రమంలో భాగంగా 43వ పాఠశాలైన హనుమాతండా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ పాఠశాల కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారవత్ మోహన్ నాయక్ సొంత గ్రామంలో ఉండటంతో, ఆయన స్వయంగా హాజరై విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చైర్మన్ సూచించారు.స్ఫూర్తి ఫౌండేషన్ చేస్తున్న సేవలను గ్రామస్తులు అభినందించారు.






