27 June, 2026 | 8:00 PM

పల్స్ పోలియోను విజయవంతం చేయండి

27-06-2026 06:36 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): పల్స్ పోలియోను విజయవంతం చేయాలని బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అశ్విని పేర్కొన్నారు. 28వ తేది ఆదివారం జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వైద్య మరియు అంగన్వాడీ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. వైద్యాధికారి మాట్లాడుతూ రేపు జరగ బోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని 0-5 సవంత్సరాల వయస్సు గల  వారందరికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని నూరు శాతం లక్ష్యంగా  కృషి చేయాలని, ఏదైనా కారణంచేత రేపు పోలియో చుక్కలు వేయించుకొని వారికి 29,30 వ తేదీలలో గృహ సందర్శన ద్వారా సర్వే నిర్వహించి వారికి వేయడం జరుగుతుందని వివరించారు.