శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం
27-06-2026 06:38 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని శ్రీరంగవరం పట్టణంలో శ్రీ హనుమాన్ శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవంతో పాటు ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజి అధ్యక్షులు బాసురాది భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి పట్టణంలో అన్ని దేవాలయలను నిర్మించుకొని ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ప్రజలకు పుణ్యం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.






