పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్
పాల్వంచ,(విజయక్రాంతి): జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో పల్స్ పోలియో, కార్యక్రమం పై కీలక సూచనలు చేశారు. జూన్ 28 నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 98, 818 మంది 0-5 సంవత్సరంలోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 925 బూత్ లు ,38 ట్రాన్సిట్ పాయింట్లు , 1001టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయడం, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.






