27 June, 2026 | 7:25 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

27-06-2026 06:15 PM

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలి.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు.

ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట జులై 1న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు కోరారు. శనివారం మండల కేంద్రములోని సిఐటియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్ధానం లో జూలై 1 నుంచి బిజెపి ప్రభుత్వం విబి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహారించుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై దశలవారీగా ఆందోళనలు చెపడాతామని హెచ్చరించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విబి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చి 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.200 వందల రోజులకు పనిదినాలు పెంచి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు గోపగాని లక్ష్మీ నరసయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.