27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అసలైన ఓట్లు తొలగిపోకుండా చూడాలి

27-06-2026 06:06 PM

- ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు 

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): నియోజక వర్గంలో అసలైన ఓట్లు తొలగిపోకుండా చూడాలని, ప్రతి ఓటరుకు స్లిప్ లు అందేలా చూడాలని మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో BLOలు, BLAలు SIR (ఓటరు సవరణ ప్రక్రియ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, అప్రమత్తంగా లేకపోతే అర్హత ఉన్న ఓట్లు కూడా తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఇంటికి వచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి సమర్పించండని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా తెలంగాణలో ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా కాపాడుతుందన్నారు.