సొంతింటి కల సహకారం చేస్తున్న ప్రభుత్వం
బైంసాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ
జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి
భైంసా జూన్ 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదలకు సంతృప్తి కలను సహకారం చేస్తుందని రాష్ట్ర పర్యాటక టూరిజం ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆదివారం బైంసా పట్టణంలో 400 మంది లబ్ధిదారులకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి పట్టాలను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం పేదవారికి గూడు ఇవ్వాలన్నది లక్షమన్నారు. 28 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి సౌకర్యం అందిస్తామన్నారు. రూ. 2.14 కోట్లతో చేపట్టనున్న మహాదేవ చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. మొక్కలు నాటి వాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పల్సి రంగారావుకర్ ప్రాజెక్టు ముంపు గురి అయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోఎంపీ నాగేష్ జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఆర్డిఓ రమేష్ రాథోడ్ మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి వైస్ చైర్మన్ కుదిజా సిద్ధిక్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ ఉన్నారు






