30 May, 2026 | 8:33 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం

30-05-2026 07:18 PM

హుస్నాబాద్/అక్కన్నపేట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంజూరు చేసింది. అనారోగ్యంతో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ కమిటీ చైర్మన్ జంగపెల్లి ఐలయ్య పాల్గొని శనివారం లబ్ధిదారులకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కీలకమైందని అన్నారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ఒకేసారి 53 చెక్కులు మంజూరు కావడం ప్రభుత్వ ప్రజాహిత పాలనకు నిదర్శనమని తెలిపారు. లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.