30 May, 2026 | 8:33 PM

సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం

30-05-2026 07:21 PM

సమస్య గురించి వివరించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ 

టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతి

షాద్ నగర్,(విజయక్రాంతి): కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక అంశం వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సైతం స్థానిక ఎమ్మెల్యే  వీర్లపల్లి శంకర్ వినతి పత్రాలను అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గం లోని సిద్దాపూర్ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు వ్యతిరెక అంశం విషయంలో స్థానిక ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేయకూడదని, వెంటనే ఈ భూముల్లో గతంలో ఇండస్ట్రియల్ పార్క్ కు కేటాయించిన విధంగా కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.

ఇక్కడ ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. తప్పకుండా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని నియోజకవర్గానికి తగు న్యాయం చేస్తారని వీర్లపల్లి శంకర్ తెలిపారు. అదేవిధంగా  ఈ అంశంపై ఆదివారం టిపిసిస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు ఎమ్మెల్యే శంకర్ లిఖితపూర్వక వినతి పత్రాలను సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో డంపు యార్డ్ ఏర్పాటు చేయకూడదని వెంటనే దీనిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రకటన జారీ కావాలని వారిని కోరినట్లు తెలిపారు.  దీనిపై రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.