calender_icon.png 5 February, 2026 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

05-02-2026 12:00:00 AM

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 4,(విజయక్రాంతి): బుధవారం ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క  చొరవతో  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 19 మంది లబ్ది దారులకు మొత్తం రూపాయలు 6,91,000 అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు శీలం ప్రతాప్ రెడ్డి, మాజీ భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆయులూరి వెంకటేశ్వర రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామక్రిష్ణ,  జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు వెజెండ్ల సాయి కుమార్, మండల సీనియర్ నాయకులు అనుమోలు వెంకట క్రిష్ణరావు, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, పంబి సాంబశివరావు, ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్వినీ, మార్కెట్, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘ నాయకులు క్లస్టర్ ఇంచార్జిలు యూత్ కాంగ్రెస్ నాయకులు  తదితరు నాయకులు పాల్గొన్నారు.