ఐదేళ్లలో 4వేల కోట్ల అభివృద్ధి పనులు
- ఖమ్మం సిటీని సుందరీకరణగా తీర్చిదిద్దాం
- నగర మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా
- నేటితో ముగియనున్న మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం
- ధన్యవాదాలు తెలిపిన మేయర్, డిప్యూటీ మేయర్
ఖమ్మం, మే 6(విజయక్రాంతి): ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం గురువారంతో ముగియనుందని, ఈ ఐదేళ్లలో సిటీ అంతటా రూ.4 వేల కోట్లతో ఖమ్మం సిటీని సుందరీకరణగా తీర్చిదిద్దినట్లు నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా తెలిపారు. బుధవారం మేయర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హయాంలో ఖమ్మం సిటీ చాలా అభివృద్ధి చెందిందన్నారు.
మోడల్ మార్కె ట్ నిర్మాణం, మున్నేరు రిటర్నింగ్ వాల్, ఖ మ్మం కార్పొరేషన్ ఆఫీస్, గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ, సిటీలోని అన్ని డివిజన్‌లలో 34 పార్కులు, ఓపెన్ జిమ్‌లు, రఘునాథ పాలెం మండలంలో స్వామి నారాయణ స్కూల్, ఇస్కాన్ టెంపుల్ శిల్పారామం, దంసలపురం కాలనీలో బాలాజీ టెంపుల్, మెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు వంటి ఎన్నో అభి వృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వందల కోట్లు తీసుకొచ్చి సిటీని తల మానికంగా మార్చారని కొనియాడారు.
రోడ్ల విస్తరణ, డ్రైన్లు, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులు వంటి ప్రతి డివిజన్ కు 10 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఖిర్కొన్నారు రోప్ వే పనులు, వెలు గుమట్ల పార్కు, 34 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టామన్నారు. కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం సొం తంగా ట్రాక్టర్లు,స్విపింగ్ మిషన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కార్పొరేషన్ వాహనాల మరమ్మతుల నిమిత్తం షెడ్ ఏర్పాటు, మహిళా సమాఖ్యలతో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
28 వేల వీధిలైట్లు, సిటీ అభివృద్ధికి అనుగుణంగా కరెంట్ పొల్స్ ఏర్పాటు చేశామ న్నారు. అదేవిధంగా హైదరాబాద్ తరహా పెట్ పార్కులు కూడా అందుబాటులోకి తె చ్చామన్నారు. సిటీలో ప్రాథమిక హాస్పిటల్స్ నిర్మాణం, లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత వంటివి ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అభి వృద్ధిలో తమ పాలక వర్గం భాగస్వామ్యం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.






