7 May, 2026 | 2:11 AM

సేవాలాల్ మహారాజ్ బోధనలను అనుసరించాలి

07-05-2026 01:05 AM

లింగాపూర్, మే 6 (జయక్రాంతి): మండల కేంద్రంలో బుధవారం జగద్జనని జగదాంబ దేవి, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ,సంత్ తపస్వి డా. రామారావ్ మహారాజ్ల భోగ్ భండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంజారా కాశీ పొవరా దేవి పీఠాధిపతి, ఎమ్మెల్సీ బాబూసింగ్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా సమాజ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తిఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలను అనుసరిస్తూ ఇతరులతో మర్యాదగా ప్రవర్తించాలి, అబద్ధాలు, చాడీలు చెప్పకూడదని, దొంగతనాలకు పాల్పడకూడదని సూచించారు. గుడుంబా సేవించడం మానుకోవాలని, పెళ్లిళ్లు , శుభకార్యాల్లో అధిక ఖర్చులను తగ్గించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, లింగాపూర్ గ్రామ నాయక్ రాథోడ్ కిరణ్ నాయక్, కారోబారి రాథోడ్ శివలాల్, సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, మందిరం పూజారి రాథోడ్ మంగులాల్ మహారాజ్, మాజీ ఎంపీటీసీలు రాథోడ్ బలరాం, జాదవ్ గణపత్, మాజీ సర్పంచ్లు రాథోడ్ రమేష్, జాదవ్ జాదూ, రాథోడ్ సుమలత ఈశ్వర్ , రాథోడ్ వినోద్, జాదవ్ రమేష్, బానోత్ హసీరామ్, జాదవ్ గణేష్, జాదవ్ లక్ష్మణ్, జాదవ్ ప్రమేష్, జాటోత్ నాందేవ్, జాదవ్ పృథ్వీరాజ్, దేవిదాస్,ధర్మ ప్రచారకర్తలు రాథోడ్ భీంరావ్ మహారాజ్, ఆడే నరేందర్ మహారాజ్, రాథోడ్ మనోజ్, జాదవ్ అర్జున్, జాదవ్ రవీందర్, బానోత్ శేషరావ్ తదితరులు పాల్గొన్నారు.