7 May, 2026 | 2:10 AM

రైతులకు రుణాలపై అవగాహన కల్పించాలి

07-05-2026 01:08 AM
  1. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
  2. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ‘రైతువారం’ నిర్వహణ

ఖమ్మం, మే 6(విజయక్రాంతి): ఖమ్మం నగర పరిధిలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స త్యశారద, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు శ్రీ ఆర్.లక్ష్మణుడు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నా రు. తొలుత జిల్లా మార్కెటింగ్ అధికారి ము ఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న అన్ని రకాల రాయితీలను సద్వినియోగ పరచుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కా మర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్, అదనపు మార్కెట్ డైరెక్టర్‌లను సత్కరించారు. అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడు తూ వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, బ్యాంకు రుణాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల రైతులు ప్రభు త్వ పథకాలను 70 శాతం వరకు ఉపయోగించుకోని లాభపడుతున్నారని అన్నా రు. కానీ మన రాష్ట్ర రైతులు 30%, 40% వరకే సద్వినియోగపరుచుకుంటున్నారని, రైతులకు సరైన అవగాహన కల్పించినట్లయితే సరుకుల నాణ్యత పెంపొందించుకొని గిట్టుబాటు ధర పొంది ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలరని తెలిపారు.

బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రకటించిన పలు పథకాలకు తక్కువ వడ్డీ రుణాలను అందజేస్తున్నామని రైతులు ఈ అవకాశాలను సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంట సాగు విధానాలు, రుణాలు, సరుకు నాణ్యత మొదలగు విషయాలపై అ వగాహన పెంపొందించుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. అంతేగాక వ్యవసాయ మార్కెట్‌లో రైతు సరుకుల దొం గతనాలను నిరో ధించేందుకు సీసీ కెమెరాల సదుపాయం కల్పించామన్నారు. కోల్ స్టోరేజీలో నిల్వచేసే సరుకులపై రుణ సదుపాయాలు కల్పిస్తున్నదని వీటిపై అవగాహన పెంపొందించుకొని రైతులు లబ్ధి పొందాలని సూచించారు.