నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ మేయర్
కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆదివారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా లో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దినం తప్పి దినం సురక్షితమైన త్రాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
నగరపాలక సంస్థ నీటి సరఫరా లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రస్తుతం మానేరు డ్యాంలో 889 పీట్ల వద్ద నీటి సామర్ద్యం ఉందని తెలిపారు. 5.8 టీఎంసీల నీరు మానేరు డ్యాం లో ఉందని... బూస్టర్ పంపుల ద్వారా 45 ఎంఎల్ డి రా వాటర్ ప్రతి రోజు నీటి శుద్దీకర కేంద్రంకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం వర్షాకాలం ఆరంభం అయింది కాబట్టి వర్షాలు సమృద్దిగా కురిస్తే బూస్టర్ పంపుల అవసరం కూడ తొలగిపోతుందని... కావల్సిన రావాటర్ ను మానేరు డ్యాం నుండి సేకరించవచ్చని తెలిపారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరా విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందీ లేదని... రాదని స్పష్టం చేశారు.






