29 June, 2026 | 3:16 AM

వెంకటేశ్వరరాజు సేవలు చిరస్మరణీయం

29-06-2026 12:00 AM

రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర రాజు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు.  పేఅండ్ అకౌంట్స్ శాఖలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటేశ్వర రాజు ఈ నెల పదవీ విరమణ పొందనున్న సందర్భంగా ఆదివారం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ భవనంలో ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు హాజరై ఎం. వెంకటేశ్వర రాజును మెమెంటో లు, పుష్పగుచ్ఛాలు, గజమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, విధి నిర్వహణలో చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో దాదాపు ౩ సంవత్సరాలపాటు జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన  వెంకటేశ్వర రాజు ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొంకురి శంకర్, టీజీవో అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, నాయకులు ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ మహేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, హరికృష్ణ, ఒంటెల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, పోలు కిషన్, హస్గర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, సుధాకర్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.