ప్రహరీ ధ్వంసం..
09-07-2026 01:37 AM
విద్యార్థులకు ఇబ్బందులు
వెల్దుర్తి, జులై 8 : మండలంలోని ఉప్పలింగాపూర్ ప్రైమరీ స్కూల్ ప్రహరీ ధ్వం సం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్‌ఎం, విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే పాఠశాల ఉండడం తో విద్యార్థులు బయటకు వస్తే వాహనాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అధికారులు స్పందించి ప్రహరీని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, కోరుకుంటున్నారు.






