గట్లమల్యాల పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో
రికార్డులు, ల్యాబుల్లో తనిఖీలు
నంగునూరు, జూలై 8: నంగునూరు మండలం గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ . ధన్రాజ్ స్పందించారు. బుధవారం ఆయన పీహెచ్సీని సందర్శించి రికార్డులు, ల్యాబ్, మందుల నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన విజయక్రాంతితో మాట్లాడుతూ. పత్రిక ద్వారా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఫర్నిచర్ వంటి లోపాలను వెంటనే సరిదిద్దుతామని, దీనిపై పూర్తి నివేదిక పంపించమని ఆయన వెల్లడించారు. అనంతరం పీహెచ్సీ రికార్డులను, ల్యాబ్ను పరిశీలించి, ఫార్మసీలో మందుల నిల్వలు, ఎక్స్పైరీ వివరాల విషయంలో పారదర్శకత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన రాజగోపాలపేట పీహెచ్సీని కూడా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.






