9 May, 2026 | 8:14 PM

తండ్రికి కూతురే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన

09-05-2026 07:14 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కన్న తండ్రి మృతి చెందగా కుమారులు లేకపోవడంతో కూతురే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కోనరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి శంకర్ (60) గతంలో సుతారి కార్మికునిగా పనిచేశాడు. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్‌లో కూతురు వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నాడు.శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై ఆయన మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన కోనరావుపేటకు తరలించారు. కుమారులు లేకపోవడంతో చిన్న కూతురు విహాన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది.