ప్రమాదకర కుక్కలను నిర్మూలించవచ్చు !
- రద్దీ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలి
- స్టెరిలైజేషన్, వాక్సినేషన్ చేయించినా సరే..
- భారత అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు
న్యూఢిల్లీ, మే ౧౯: పిచ్చిపట్టిన లేదా మానవాళికి వ్యాధులు వ్యాపింపజేసే వీధి కుక్కల ను నిర్మూలించవచ్చని (కారుణ్య మరణం థనేషియా) సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. అయితే.. పశు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారి పర్యవేక్షణలోనే ఆ ప్రక్రియ జరగాలని సూ చించింది.
అలాగే, విద్యాసంస్థలు, ఆసుపత్రు లు, బస్టాండులు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీగా ఉండే ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల నుంచి తక్షణం వీధి కుక్కలను తరలించాలని ఆదేశించింది. అవసరమైతే ప్రత్యేక షెల్టర్లు ఏర్పా టు చేయాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ కుక్కలను మళ్లీ రద్దీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు వీల్లేదని కూడా తేల్చిచెప్పింది.
మనుషులు ఎ లాంటి భయాందోళనలు లేకుండా రోడ్లపై తిరిగే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్నదని గుర్తుచేసింది. గతేడాది నవంబర్ ౭న ఇవే అంశాలపై తాము తీర్పుని చ్చామని, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు కుక్కల సంరక్షణ కోసం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లంటినీ కొట్టివేసింది.






