గ్యాస్ కొరతపై సిపిఎం వినూత్న నిరసన
ఘట్ కేసర్,(విజయక్రాంతి): వంట గ్యాస్ కొడతను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత ఆరోపించారు. బుధవారం పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో సిపిఎం కార్యకర్తలు వంటగ్యాస్ పక్కన పెట్టి కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సబిత మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మన దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టుపెట్టి అమెరికా, ఇజ్రాయిల్ లకు లొంగుబాటు వైఖరి వల్ల వంటగ్యాస్ సంక్షోభం ఏర్పడిందన్నారు.
ఫలితంగా హోటల్లు, టీ దుకాణాలు ఇతర చిరు వ్యాపారులకు గ్యాస్ కొరత ఏర్పడి ఫలితంగా వాటి ధరలు దారుణంగా పెరిగాయన్నారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ ను నియంత్రించి న్యాయంగా అవసరమైన ప్రతి ఒక్కరికి వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కె. అలివేల, అరుణ, సునీతదేవి, నాగమణి, శ్రావణి, పర్వీన్, ప్రమీల, శోభ, స్వరూప, సాలమ్మ , కలమ్మ, పద్మ, నవనీత, రేణుక, ఫర్జాన తదితరులు పాల్గొన్నారు.




