10 April, 2026 | 11:52 PM

శ్రీ చైతన్యలో స్నాతకోత్సవ వేడుకలు

10-04-2026 09:25 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనగర్ శాఖకు చెందిన శ్రీ చైతన్య పాఠశాలలో ఒకటవ తరగతి, ఆరవ తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థుల కోసం శుక్రవారం స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు నిర్వహించి, విద్యార్థులకు స్నాతకోత్సవం ప్రదానం చేశారు. విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలలో పాల్గొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయూబ్, ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజా రాణి, ఇన్‌చార్జ్ అనగమాట ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.