10 April, 2026 | 11:49 PM

జాకోర, చందూర్ ఎత్తిపోతల పంపు మోటార్ల ట్రయల్ రన్ చేసిన పోచారం

10-04-2026 09:27 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి 106 కోట్లతో నిర్మించి త్వరలో ప్రారంభించనున్న వర్ని మండలం జాకొర, చందూర్ ఎత్తిపోతల పథకాల పంపు మోటార్ల ట్రయల్ రన్ ను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారులు పెంటారెడ్డి, ఇరిగేషన్ CE శ్రీనివాస్ వర్ని, చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.