30 July, 2026 | 2:04 AM

గడ్డం ఎన్‌క్లేవ్‌లో రూ.1.4 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

30-07-2026 01:25 AM

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి 

బడంగ్ పేట్, జులై 29(విజయక్రాంతి): మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చొరవతో గుర్రంగూడ గడ్డం ఎన్క్లేవ్ (ఫేస్ 1, 2, 3) కాలనీల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 1.40 కోట్లు మంజూరైనట్లు బడంగ్పేట్ బీ అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి తెలిపారు. బుధవారం కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల కాలనీవాసుల సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి రోడ్ల నిర్మాణానికి రూ. 1.40 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేకి కాలనీవాసుల తరఫున రాంరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పాల్గొన్నవారు: ఈ పర్యటనలో గడ్డం ఎన్క్లేవ్ సంక్షేమ సంఘాల అధ్యక్షులు రాకేష్ రెడ్డి, నరసింహ, లింగారెడ్డి, ప్రతినిధులు సురేష్, శేఖర్, అనిల్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.