30 July, 2026 | 2:02 AM

నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలి

30-07-2026 01:24 AM

నిర్మల్ జులై 29 (విజయక్రాంతి): తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) రౌతు చరణదాస్ నిర్మల్ జిల్లా కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ బిల్లుల సకాల చెల్లింపుల కోసం సంస్థ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌ఈ సుభాష్, డీఈ నాగరాజు, ఎస్‌ఏఓ దిగంబర్, ఏఓ రమేశ్, ఏడీఈ శ్రీనివాసరావు, ఏఏఓలు ప్రతాప్, మధుకర్, ఏఈలు సంజీవ్, రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు.