5 June, 2026 | 9:10 PM

సీఎం బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్ మృతి

05-06-2026 07:36 PM

- పిడుగు రూపంలో వెంటాడిన మృత్యువు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా నాగర్‌ కర్నూల్ జిల్లా మామిళ్లపల్లి సమీపంలో పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ మద్దమల్ల రాజు (2014 బ్యాచ్) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి సంతాపం తెలిపారు.