5 June, 2026 | 9:11 PM

పిడుగు పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

05-06-2026 07:33 PM

* సీఎం బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఘటన

అచ్చంపేట: ప్రమాదవశాత్తు పిడుగు పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన మద్దిమల్ల రాజు (35) ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 2013 బ్యాచ్ కు చెందిన అతను ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు ఉమ్మడి మహబూబ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శనివారం కొల్లాపూర్ లోని ప్రాజెక్టులను సందర్శించారు. సీఎం బందోబస్తులో భాగంగా రెండు రోజులుగా కొల్లాపూర్ కు వెళ్లారు. శనివారం సాయంత్రం తిరిగి కారులో వస్తూ మామిళ్ళపల్లి సమీపంలోని చెట్టు కింద ఆగాడు. అక్కడ నిలబడి కాల కృత్యాలు తీర్చుకుంటుడగా ఉరుములతో కూడిన వర్షంలో ఒక్క సారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై ఉప్పునుంతల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.