22 May, 2026 | 2:05 AM

రాజీవ్ గాంధీని స్మరించుకున్న కాంగ్రెస్ శ్రేణులు

22-05-2026 12:58 AM

ఖమ్మం, మే 21(విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  35వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన  బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఘనంగా జరుపుకున్నారు.  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న,

జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఎస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మైనారిటీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో కలిసి ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు. అనంతరం మయూరి సెంటర్ నందు గల స్వర్గీయ రాజీవ్ గాంధీ  విగ్రహానికి నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో నాగండ్ల దీపక్ చౌదరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, 

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ లతో కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భానోత్ బాలాజీ నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిలారి అనిల్ కుమార్,జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బండి మాధవరావు, నగర ఓబీసీ సెల్, మైనారిటీ  అద్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ కైసర్ అబ్బాస్ బేగ్, నగర కాంగ్రెస్ నాయకులు పల్లెబోయిన చంద్రం, శంకర్ నాయక్, జహీర్ నాయకులు పాల్గొన్నారు.