9 July, 2026 | 3:02 AM

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం ‘టాస్క్’ శిక్షణ ముగింపు

09-07-2026 01:49 AM

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఐబీఎం స్కిల్స్బిల్డ్‌టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల అడ్వానస్డ్ గ్రాడ్యుయేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు, ప్రిన్సిపాల్ డా. బి. గోపాల్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినుల్లో సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు.

శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ నైపుణ్యాలు, డిజైన్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యల పరిష్కార సామర్థ్యాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు.  అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మన్మోహన్ తివారి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.