9 July, 2026 | 3:02 AM

పేదల సొంతింటి కల సాకారం

09-07-2026 01:49 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు, జూలై 8 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఆయన లబ్దిదారులతో కలిసి ప్రారంభించి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

అనంతరం ఐటీసీ-పీఎస్పీడీ  సహకారంతో సుమారు రూ.1కోటి 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆధునిక కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోత్ సరోజ, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి,హౌసింగ్ ఏఈ ఉదయ్, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.