7 March, 2026 | 9:19 PM

బాల్ బ్యాడ్మింటన్ జాతీయస్థాయి క్రీడాకారున్ని సన్మానించిన కలెక్టర్

07-03-2026 07:07 PM

జిల్లా పేరు జాతీయ స్థాయిలో చాటిన క్రీడాకారుడు

కామారెడ్డి,(విజయక్రాంతి): బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభ కన భరిస్తున్న జాతీయస్థాయి క్రీడాకారుడు శశిధర్ ను శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగు వాన్ సన్మానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామానికి చెందిన విద్యార్థి శశిధర్ ను అభినందించారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభ కన బరుస్తున్న శశిధర్ 15 సార్లు రాస్తా స్థాయిలో, ఏడు సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇటీవల 14 ఫిబ్రవరి 2026 నుండి 19 ఫిబ్రవరి 2026 వరకు ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్ లో ఇండియా జట్టు తరఫున పాల్గొని బంగారు పథకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు.

బాల్ బ్యాడ్మింటన్ క్రీడాలో పాల్గొని మంచి ప్రతిభ చాటుతున్నారని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తుల ప్రపంచ స్థాయిలో కూడా రాణించే లకు చెయ్యాలని జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోయపల్లి చిన్న నర్సింగరావు, కార్యదర్శి కృష్ణమూర్తి, నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ కోశాధికారి రాజేశ్వర్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, శశిధర్ తండ్రి శివరాజులు, తదితరులు పాల్గొన్నారు.