9 May, 2026 | 5:23 AM

పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరా

09-05-2026 01:08 AM

కాంగ్రెస్ నాయకుడు జక్కిడి సత్య తేజ్ రెడ్డి 

ఎల్బీనగర్, మే 8: పేదలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు జక్కిడి సత్యతేజ్ రెడ్డి అన్నారు. మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని నివాసం ఉండే  చిత్తలూరి రాము అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ నాయకుడు జక్కిడి సత్య తేజ్ రెడ్డిని సంప్రదించారు. ఈ మేరకు ఆయన స్పందించి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1.88 లక్షల విలువైన చెక్కును శుక్రవారం తన నివాసంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. పథకం పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరమని, నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాత్ తదితరులు పాల్గొన్నారు.